కాంగ్రెస్, బిజెపి ముసలి కన్నిరు కారుస్తుంది- హరీష్‌

389
Harish Rao
- Advertisement -

మెదక్ జిల్లా నిజాంపెట మండలం నార్లాపూర్ గ్రామంలో కొండపొచమ్మ రామయంపేట్ కేనాల్ పనులు ఈరోజు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేశ్వరం ద్వార ఉమ్మడి రామాయంపేట మండలంలో 41వేల ఎకరాలకు నీరు అందిస్తాం. రెండు మూడు రోజుల్లో మెదక్ జిల్లా గ్రీన్ జొన్ లొకి వస్తోంది. అప్పటి వరకు అందరూ మాస్క్ లు వేసుకోవాలి లేకుంటే 500 పైన్ వేస్తామన్నారు. రైతులకు రుణ మాపి డబ్బులు 1198 కొట్లరూపాయలు రెండు రోజుల్లో బ్యాంక్‌లో జమచేస్తాం. కొద్ది రోజుల్లో రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకులో జమచేస్తామని మంత్రి తెలిపారు.

Harish Rao

కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రంలో ఎక్కడ దాన్యంకు గిట్టుబాటు ధర 1500 ఉంటే తెలంగాణలో 1830 ధరతో మొత్తం దాన్యం కొనుగోలు చేస్తోంది. రైతులు పేరుతో కాంగ్రెస్, బిజెపి ముసలికన్నిరు కారుస్తుంది. వారం రోజులలో భూనిర్వాసితులకు నష్ట పరిహరం అందిస్తాము. వర్షాలతో సంబంధం లేకుండా సాగునీరు అందిస్తాము. రైతులు సన్న రకం వరి పండించాలి, రైతులకు అందుబాటులో విత్తనాలు సమకూర్చాం. రైతులు బాధపడొద్దు మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీష్‌ బరోసా ఇచ్చారు.

- Advertisement -