గజ్వేల్‌లో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌లోని కొల్గూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్…ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో గజ్వేల్ టాప్‌లో నిలిచిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుటే కాంగ్రెస్ అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. కొల్గూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన హరీష్..అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
వంటేరు ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ దొంగలే.. ఆ దొంగలు ఇప్పుడు ఒక్కటయ్యారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం రూ. 10 వేలకు పెంచుతామన్నారు. పేద రైతులు చనిపోతే రైతు బంధు బీమా పథకం కింద పరిహారం అందిస్తున్నామని గుర్తు చేశారు.
బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు అందిస్తున్నామని చెప్పారు. బతుకమ్మ చీరలను అడ్డుకున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.