శాస్త్రవేత్త వీరబత్తిని సురేందర్ కు అభినందనలుః మాజీ మంత్రి హరీష్‌ రావు

201
Harish Rao New

భారతదేశ శాస్త్ర – సాంకేతిక – అంతరిక్ష విజ్ఞానానికి తలమానికం గా నిలిచే చంద్రయాన్ -2 ప్రయోగంలో పాలు పంచుకున్న సిద్దిపేట బిడ్డ, అంతరిక్ష పరిధోధనా శాస్త్రవేత్త వీరబత్తిని సురెందర్ కు అభినందనలు తెలిపారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు. భారతదేశానికే గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణమన్నారు.

భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి, యావత్ వైజ్ఞానికి ప్రపంచానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. మీకు మరోసారి వ్యక్తిగతంగా నా తరుఫున, సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరుఫున హృదయపూర్వక శుభాకాంక్షాలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.