ప్రొ.జయశంకర్‌కు హరీష్‌ రావు నివాళి..

375
jayashankar sir
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లడుతూ: ఆచార్య జయశంకర్ 85వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించాము. ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాటం పటిమ,ఆయన తపన రాష్ట్ర సాధనలో అయన కృషి ఎవరు మర్చిపోలేరు.జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆయన అని హరీష్‌ రావు అన్నారు.

MLA Harish rao

ఆయన టీఆర్‌ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సూచనలు, సలహాలు అందించారు. డిసెంబర్ 9న అర్ధరాత్రి వచ్చిన ప్రకటన జయశంకర్ స్వయంగా రాసి కేంద్ర హోంశాఖకు పంపిస్తే ఆనాడు కేంద్రము ప్రకటన చేసిందని హరీష్ గుర్తు చేశారు. ప్రధాన మంత్రులకు, రాష్ట్రపతి లకు వినతిపత్రం ఇవ్వాలన్న శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్న ప్రతి అంశంలో జయశంకర్ సార్ ఉన్నాడు. విద్యావంతులను,మేధావులను,ఉపాధ్యాయులను చైతన్య పరుస్తూ రాష్ట్రానికి జరుగుతున్న వివక్షను,రాష్ట్రం ఎందుకు అనే ఆవశ్యకతను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నామని హరీష్‌ అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడలన్నపుడు తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన దగ్గర నేర్చుకొని అసెంబ్లీలో బల్ల గుద్ది వాదించి చర్చించామని అన్నారు. ఆయన ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమని.. చివరి దశలో క్యాన్సర్ తో మరణించడం చాలా బాధాకరం. ఆయన జీవం మన మధ్యలో లేకపోయిన్నప్పటికి ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. అని హరీష్‌ రావు తెలిపారు.

- Advertisement -