తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈరోజు టీఆర్ఎస్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ జూటా మాటలు మానుకోవాలి లేదంటే..ప్రజలే తగిన బుద్ధి చెపుతరు అని మంత్రి హెచ్చరించారు.
కేంద్రం రాష్ట్రానికి ఎక్కువే ఇచ్చిందని సంజయ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రానికి తెలంగాణ రూ.3,65,797 కోట్లు పన్నుల రూపంలో ఇచ్చిందని తెలిపారు. కానీ కేంద్రం ఇచ్చింది రూ.1,68,647 కోట్లు మాత్రమేనని తెలిపారు.
తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.7,183 కోట్లు ఇవ్వడం లేదని మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాలని హరీష్ డిమాండ్ చేశారు. దమ్ముంటే పెండింగ్ నిధులు 7,183 కోట్లు కేంద్రం నుండి తీసుకురా అంటూ బండి సంజయ్ కి మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు.