బీజేపీ గోబెల్స్ ప్రచారం పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట అక్షయ గ్రాండ్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్…గోబెల్స్ బతికుంటే దుబ్బాకలో బీజేపీ ప్రచారాలను చూసి ఉరి వేడుకునే వాడని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారాలు, నాయకులు కార్యకర్తలు చేస్తున్నవన్ని బోగస్…. దుబ్బాక ప్రజలు వీటిని గమనించాలన్నారు.
3 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణానికి మంజూరు అయితే నిర్మించకుండానే నిధులు మింగేశారని ఆరోపణలు పచ్చి అబద్ధాలు అన్నారు. అసలు ఆ టెండరే పూర్తి కాలేదు.. మూడు రూపాయలు కూడా దానికి మంజూరు కాలేదన్నారు. బీడీ పెన్షన్లలో 1600 మోడీ, 400 మాత్రమే రాష్ట్రం ఇస్తున్నట్లు బిజీపి దుష్ప్రచారం చేయదం తగదన్నారు.
మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ తో బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు అన్నారు. దుబ్బాకలో టిఆర్ఎస్ గద్దె కూల్చారని చెప్పి సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పై తిరగబడ్డ కార్యకర్తలని శ్రీనువాస్ నాయక్ అనే బిజెపి కార్యకర్త పోస్టింగ్ పెట్టాడు. ఐది పచ్చి అబద్ధం.. ఇవి కాల్వకర్తు లో రెండేళ్ల క్రితం టిక్కెట్ల జెటాయింపు సందర్బంగా జరిగిన చిన్న ఘటనను తిసుకొచ్చి, దుబ్బాక కు లింక్ చేసి ఈ పోస్టింగ్ పెట్టారు అని మండిపడ్డారు. దీనిపై టిఆర్ఎస్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారని చెప్పారు.
బీజేపీ ఇట్లా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది….బీజేపీ నేతలు ఈ ప్రచారాలను నిరూపిస్తారా ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసురుతున్న ? అన్నారు. దమ్ముంటే మీరు చేస్తున్న ప్రచారాలను నిరూపిస్తే, బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే నా ఆర్ధికశాఖ మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు. నిరూపించక పోతే తన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దుబ్బాక అంబెడ్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేసినా బీజేపీ కి హుజూర్ నగర్ లో పట్టిన గతే దుబ్బాకలో నూ పడుతుందన్నారు.