ఆదివారం సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో 27 కోట్ల 50 లక్షలతో 100 పిట్ల ఇండస్ట్రియల్ పార్క్ రోడ్ పనులకు మంత్రి హరీష్ రావు శంకస్థాపన చేశారు. హరీష్ మాట్లాడుతూ.. 322 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం.
ఈ ఇండస్ట్రియల్ పార్క్ వల్ల 5 వేల మందికి ఉద్యగావకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఇండస్ట్రియల్ పార్క్ కోసం డీఎక్స్‌ఎన్ కంపెనీ వాళ్ళు వేగంగా పనులు చేస్తున్నారు. ఈ కంపెనీ వల్ల 900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు.నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం.
పరిశ్రమలకు కనీస అవసరాలు రోడ్. నీరు. 100 రోజుల్లో ఈ రోడ్ పనులు పూర్తి కావాలి. ఈ రోడ్ వల్ల ఈ ప్రాంత రైతుల భూములకు విలువ పెరగుతుంది, రైతులు భూము లను అమ్ముకోవద్దు. ఈ రోడ్ కోసం భూములు కోల్పోయిన రైతలకు కోటి 25 లక్షల రూపాయల చెక్కును ఇస్తున్నాం. అలాగే బీడీ కార్మికుల ఉపాధి కోసం అంబిక అగర్ బత్తి కంపెనీ ముందుకు వస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.