దేశానికి శక్తి గల సమాజాన్ని అందించగలిగేది ఒక్క విద్యాలయాలు మాత్రమే అన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(టస్మా) ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎడ్యుకేషన్ ఎక్స్‌పో – 2019 జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. .టస్మా ఇలాంటి ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయం. తెలంగాణ ఉద్యమం లో ట్రస్మా సహకారం గొప్పది అన్నారు. పిల్లలకు విద్యతో పాటు నాలుగు లక్షల మందికి ప్రైవేటు స్కూల్స్ ఉపాధినిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలి. పిల్లలకు నాణ్యమైన విద్య ఎంత అవసరమో విలువలతో కూడిన విద్య అంతే అవసరం. ప్రపంచాన్ని మార్చే శక్తి గల ఆయుధం విద్య అని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న ఈ సమయంలో మన దేశ సంస్కృతి గొప్పతనం గురించి విద్యార్దులకు తెలియజేయాలి అన్నారు. విద్యాలయాలనుంచే పిల్లలకు దేశ చట్టాలు, విలువలపై అవగాహన కల్పించాలి అని ఉపాధ్యాయులను కోరారు.