సివిల్స్ విజేతలకు హరీష్ అల్పాహార విందు..

61
harishrao
- Advertisement -

ఇటీవల విడుదలైన సివిల్స్ ఫైనల్ పరీక్షా ఫలితాలలో ర్యాంకులు సాధించిన విజేతలు కొందరికి తెలంగాణ రాష్ట్రమంత్రి టి. హరీష్ రావు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని తమ నివాసంలో అల్పాహారవిందు ఇచ్చారు. “సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ”డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో ర్యాంకర్లు హరీష్ రావును కలిశారు. ర్యాంకర్లను మంత్రి హరీష్ రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్ పరీక్షలలో ర్యాంకులు సాధించడంద్వారా వీరు తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు.

స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత మేడం హైదరాబాద్ లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్ బి అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికి పైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమని అభినందంచారు. సీఎస్ బి అకాడమీనుండి భవిష్యత్తులో మరింతమంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని హరీష్ రావు ఆకాంక్షించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత మేడం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎస్ బి అకాడమీ ద్వారా మరింతమంది సివిల్స్ విజేతలను దేశానికి అందిస్తామని ఆమె హామీనిచ్చారు. ఇప్పటికే తెలుగువారు పెద్దసంఖ్యలో సివిల్స్ విజేతలుగా నిలిచారన్నారు.

మంత్రిని కలిసినవారిలో ర్యాంకర్లు గడ్డం సురేందర్ రెడ్డి(69),అరుగుల స్నేహ(136),చైతన్య రెడ్డి(161),రంజిత్ కుమార్ పార్వతి(574),బి సమరాంజ్(676)తో పాటు ఎన్నారై మల్లవరపు సరిత ఉన్నారు.

- Advertisement -