హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఈ నెల 21న జరుగనుంది. పోలింగ్‌కు టైం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారం మరికొద్దిరోజుల్లో ముగియనుండటంతో వివిధ పార్టీల అగ్రనాయకులు ప్రచారం చేయనున్నారు. ఇక మరోవైపు అధికార టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ నెల 17,18 తేదీల్లో హుజుర్‌నగర్‌లో ప్రచారం చేయనున్నారు మంత్రి హరీష్ రావు. ఇక ఈనెల 18న జరిగే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి 18,19 తేదీల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు.
ఇక ఇప్పటివరకు హుజుర్‌నగర్‌లో 72 లక్షల 29వేల 500 రూపాయల నగదు,7వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఇప్పటి వరకు 8 లక్షల, 65 వేల, 112 రూపాయలు ఖర్చు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి 5 లక్షల 27వేల 621 రూపాయలు,బీజేపీ క్యాండిడేట్ కోట రామారావు 4 లక్షల 22 వేలు, టీడీపీ అభ్యర్థి 3 లక్షల 46 వేలు,స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 3 లక్షల 73 వేలు ఖర్చు చేశారని వెల్లడించారు.