- Advertisement -
మంత్రి హరీష్ రావు గురువారం సిద్దిపేటలోని ఆయన నివాసంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అలాగే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఓ వరమని మంత్రి అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందన్నారు.
- Advertisement -