ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్ విజయం, కేసీఆర్ విజయం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్ రావు..బీఆర్ఎస్ నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదా? అన్నారు.
మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా?,రైతుల నోరు కొడుతున్నడు, కడుపు కొడుతున్నడు రేవంత్ రెడ్డి అంటే గాని ఆలోచన రాదా?,లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే గాని చలనం ఉండదా? చెప్పాలన్నారు.
ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గం… ఇకనైనా రాజకీయకక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించండి….కల్వకుర్తి వలే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్ విజయం, కేసీఆర్ గారి విజయం. @BRSparty నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక రాదా?
మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రావా?
రైతుల నోరు కొడుతున్నడు, కడుపు కొడుతున్నడు రేవంత్ రెడ్డి అంటే గాని… https://t.co/NB4qUtt5NJ pic.twitter.com/FLjpp1AgBe
— Harish Rao Thanneeru (@BRSHarish) July 8, 2025
Also Read:ఫిష్ వెంకట్‌కి విశ్వక్ సేన్ సాయం

