Harish:మాట మార్చడమే మీ విధానమా?

2
- Advertisement -

తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డు అలైన్‌మెంటును మారుస్తామన్నారని.. ఇప్పుడేమో మాట మార్చి, నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు ఆర్ఆర్ఆర్ బాధితులు. ఈ మేరకు హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావుకు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని మండిపడ్డారు హరీశ్‌.

ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉత్తర దిక్కు ట్రిపుల్‌ ఆర్‌ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు. . రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల గొంతును వినిపిస్తాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సమస్య పరిష్కరించే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

Also Read:చరిత్ర తిరగరాసిన అల్లు అర్జున్!

- Advertisement -