మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం… హరీశ్‌ అభిమాని లేఖ

207
- Advertisement -

హరీశ్ రావు అంటే ఒక బ్రాండ్‌… ఈ పేరు తెలియని వారు ఉండరు. పైగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రి. ఆయన ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కంకణ‌బద్ధులై పనిచేస్తూనే, ఎప్పటికప్పుడు ఆరోగ్య జాగ్రత్తలు చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. దీంతో ఒక అభిమాని మంత్రి హరీశ్‌రావుకు ఆరోగ్య సలహాల గురించి ఒక లేటర్‌ రాసి మంత్రికి అందించారు.

మంత్రి హరీశ్ రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని నేరుగా మంత్రికే ఒక లేఖ అందించారు. అందులో ఆరోగ్య హెచ్చరికలను ప్రేమతో సూచించారు. మీ ఆరోగ్యమే మాకు మహా భాగ్యమని, మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారని, ప్లాస్టిక్ బాటిల్ నీరు తాగడం వల్ల శరీరంలో లివర్, చెస్ట్ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని, ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలాజిస్ట్ డాక్టర్. విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో వెల్ల‌డించార‌ని చెప్పుకొచ్చారు.

దయచేసి మీరు ఇక నుంచి కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని కాగితంపై రాసి శుక్రవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్ రావుకు బల్వంతపూర్ రోడ్డు వైపు ఉన్న డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద అందించాడు. ఈమేరకు తన అభిమాని రాసిన లేఖ ప్రకారం తను నడుచుకుంటానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

 

- Advertisement -