- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుండగా త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌ని స్టన్నింగ్‌గా కట్ చేయగా ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ధీమాతో ఉన్నారు.
పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి చిత్రం కాగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ట్రైలర్ ఉండనుందని తెలుస్తోంది.
Also Read:ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ టర్కీ
- Advertisement -

