పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడుపోసుకుంటున్న సమయం.. అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇప్పటి దాకా మేకలు తినే పులిని చూసి ఉంటారు. ఇప్పుడు పులులను వేటాడే బెబ్బుల్ని చూస్తారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ విజిల్స్ వేయించక మానదు.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పార్ట్ 1 తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

