హరిహర వీరమల్లు.. సెకండ్ సింగిల్

16
- Advertisement -

జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ కానుండగా ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది.

ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజా రెండో సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తోండగా ఫస్ట్ పార్ట్‌ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Also Read:డొనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీ భేటీ..

- Advertisement -