పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ తొలుత మే 9న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే బుక్ మై షోలో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ 2025 జూన్ 12 అని పోస్ట్ చేసింది. జూన్ రెండో వారంలో సినిమా రిలీజ్ అవ్వొచ్చు అని వార్తలు వచ్చాయి కాబట్టి ఇదే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read:Health Tips:కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలాంటే?

