- Advertisement -
పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా “హరిహర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” గ్లోబల్ విడుదలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. జూలై 24న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.
రిలీజ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తొలుత తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఉంటాయని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఉండనుందని తెలుస్తోంది. శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read:తెలంగాణ వెదర్ అప్‌డేట్..
- Advertisement -

