హరి దర్శకత్వంలో ‘Vishal 34’

50
- Advertisement -

ప్రస్తుతం డిటెక్టివ్ 2తో బిజీగా ఉన్న హీరో విశాల్ తన 34వ సినిమాను అనౌన్స్ చేసేశాడు. తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తన 34వ సినిమాని చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భరణి’, ‘పూజ’ హిట్ కొట్టాయి. తాజాగా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు విశాల్.

మా కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మాదిరే ఈ మూవీ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ఒక స్పెషల్ ట్రీట్ కూడా ఇవ్వనుంది అని పేర్కొన్నారు హీరో విశాల్.ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ స్టోన్‌ బెంచ్‌ స్టూడియో బ్యానర్ పై నిర్మిస్తుండడం గమనార్హం. జి స్టూడియోస్‌ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతుంది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తురు.

Also Read:బోడ కాకరకాయలు తింటే.. ఎన్నో రోగాలు దూరం!

విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా సెప్టెంబర్ 15న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. అలాగే డిటెక్టివ్ 2 సినిమా షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు విశాల్.

Also Read:వరదలతో దక్షిణకొరియా అతలాకుతలం..

- Advertisement -