డ్యాన్సర్‌ ను కాబోయి… యాక్టర్‌నయ్యా…!

211
Hari Teja about tollywood entry
- Advertisement -

‘అఆ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హరితేజ. తాను చేసిన పాత్రకి మంచి మార్కులే పడ్డప్పటికీ రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే ఆ లోటు బిగ్ బాస్ రూపంలో తీరింది. ఒక్క షో తో అందరికి తన గురించి తెల్సింది. షో లో తాను చేసిన బుర్ర కథ నాటిక చాలా హిట్ అయింది. తనకి ఎంత టాలెంట్ ఉందొ నిరూపించుకుంది. అయితే తను మాత్రం యాక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీకి రాలేదని, తనకి డాన్స్ అంటే ఇష్టమని చెప్పింది.

అనుకోకుండా యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందని ఒక షో లో చెప్పుకొచ్చింది. తనకు క్లాసికల్ డాన్స్ లో మంచి ప్రవేశం ఉందని,   హైదరాబాద్ – రవీంద్రభారతిలో జరిగిన క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ లో తాను  పాల్గొన్నానని, ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత కొందరు తన ఫోటోలు తీశారని  ఆ ఫోటోలే సినిమా ఆఫీసులకి వెళ్లిపోయాయని,  అదే సమయంలో ..  ఓ సీరియల్ వారు కొత్త అమ్మాయి .. తెలుగు అమ్మాయి కోసం వెతుకుతున్నారని వాళ్లు తన ఫోటోలు చూసి ఎవరీ అమ్మాయి అంటూ ఆరాలు తీశారు.

ఫోన్ చేసి పిలిపించమని చెప్పడంతో .. వాళ్లు నన్ను పిలిపించారు. అప్పుడు నేను పదో క్లాసే చదువుతున్నాను అని తెలిపింది హరితేజ.  మొదటి నుంచి మంచి డాన్సర్ ను కావాలనే కోరిక బలంగా ఉండేది .. కానీ నన్ను ఇలా ఆర్టిస్టును చేసేశారు” అంటూ నవ్వేసింది.

- Advertisement -