పవన్ ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ లుక్ అదిరింది..

598
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లిమ్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రానికి ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్ ఖరారు చేశారు. 17వ శతాబ్దం నాటి నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ సరసన యువనటి నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఫస్ట్ గ్లిమ్స్ లో పవన్ జంప్ చేసే సన్నివేశం మరియు చేతిలో ఈటె పట్టుకొని చేసిన యాక్షన్ సీన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం గూస్ బమ్స్ కలిగిస్తోంది. హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పవన్ తొలిసారి నటిస్తున్న పీరియాడికల్ సినిమాని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు శాంపిల్ గా చూపించారు.

- Advertisement -