- Advertisement -
హరిహర వీరమల్లు సినిమాను మార్చి 28న విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే ఇక మిగిలిన సమయం కేవలం 40 రోజులు మాత్రమే. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్‌తో సహా సినిమా మొత్తం సిద్ధంగా ఉంది.
అయితే, చిత్రంలో ఒక కీలకమైన సీన్ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. అందుకు పవన్ కళ్యాణ్ డేట్లు అవసరం. అయితే ప్రస్తుతం పవన్ షూటింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పవన్ మరింత బిజీగా ఉండే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో డేట్లు ఇచ్చినప్పటికీ, సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలరా? అనేది ఇప్పటికీ పెద్ద అనుమానంగానే ఉంది.
Also Read:మోదీ బీసీ అయితేంది.. కాకపోతేంది?
- Advertisement -