లోక్‌సభ బరిలో హార్ధిక్ పటేల్..

242
Hardik Patel
- Advertisement -

రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు గుజరాత్‌ పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌. బుధవారం లక్నోలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన హార్థిక్ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు.

హార్థిక్ పోటీ చేస్తే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో హార్థిక్ ప్రకటనతో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో హార్దిక్‌ పోటీ చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో 2019 కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకువస్తున్నారు హార్థిక్.

గుజరాత్‌లోని అమ్రేలి ప్రాంతం నుంచి హార్దిక్‌ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌ నుండి బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించే నేతల్లో హార్థిక్‌ తో పాటు జిగ్నేష్‌,అల్పేష్ ఠాకూర్ ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిగ్నేష్‌తో పాటు అల్పేష్‌ సైతం ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. బనస్కంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేష్ గెలుపొందగా రాదన్‌పూర్ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన అల్పేష్ ఠాకూర్ విజయఢంకా మోగించారు. తాజాగా హార్థిక్ సైతం ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించడంతో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.

- Advertisement -