హార్ధిక్ పాండ్యా మెరుపులు..బెంగుళూరుకు తప్పని ఓటమి

309
hardik_pandya_
- Advertisement -

వరుసగా ఆరు ఓటమిల తర్వాత 7వ మ్యాచ్ గెలిచి సంబుర పడ్డ బెంగుళూరు టీం కు ఆతర్వాత జరిగిన మ్యాచ్ లో మరోసారి పరాజయం తప్పలేదు. నిన్న రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్ లో 5వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 171పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 8పరుగుల వద్దే అవుట్ కాగా, మరో ఆటగాడు డివిలీయర్స్ 75 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 50పరుగులు, పార్ధివ్ పటేల్ 28 పరుగులు చేశారు.

ఇక మిగతా వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 172భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 28పరుగులు చేయగా, డికాక్ 40పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ 29, ఇషాన్ కిషన్ 21,కృనాల్ పాండ్యా 11, హార్ధిక్ పాండ్యా 31పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు మిడిల్ ఆర్డర్ హార్దిక్ పాండ్యా. బెంగుళూరు టీం ఎలాగైన గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయి ప్లే ఆఫ్ కు దూరమైంది.

- Advertisement -