- Advertisement -
అంతా ఊహించినట్లుగానే టీమిండియా టీ20 కెప్టెన్గా నియమితులయ్యాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం జాతీయ సెలెక్షన్ కమిటీ 16 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఈనెల 17న జైపూర్, 19న రాంచీ, 21న కోల్‌కతాలో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్లు బుమ్రా.. షమి, స్పిన్నర్ జడేజాకు పొట్టి సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.
భారత టీ20 జట్టు:
రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, చాహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, సిరాజ్.
- Advertisement -