చాపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాడు హార్ధిక్ పాండ్యా.. పాక్ వెన్నులో వణుకు పుట్టించాడు. జట్టు సభ్యులందరూ ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా పాండ్యా మాత్రం దుమ్మురేపాడు. ఒకానొక దశలో పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తూ అత్యంత వేగంగా హాఫ్ సెంచురీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన పాండ్యా 32 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత స్కోరు 76 పరుగుల వద్ద సహచరుడు రవీంద్ర జడేజా (15)తో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జడేజాపై పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో అరుస్తూ మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనే ఆధారంగా సరదాగా కొందరు తీసిన ఓ యానిమేషన్ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది. హార్డిక్ పాండ్యా, జడేజా మ్యాచ్ ముగిసినప్పటికీ తెగకొట్టుకున్నట్లు ఈ వీడియోను రూపొందించారు. వైరల్ అయిన ఈ ఫైటింగ్‌ను చూడండి.
https://youtu.be/SBp8gDwCbXA