హార్దిక్ పాండ్యా @ 228..

285
hardik
- Advertisement -

టీమిండియాలో విధ్వంసక ఆటతీరుకు పెట్టింది పేరు హార్ధిక్ పాండ్యా. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ మ్యాజిక్ చేయగల సత్తా హార్ధిక్ సొంతం. ఇక హార్ధిక్ టీమిండియాలోకి అడుగుపెట్టిన తొలి నాళ్ల‌లో 228 నెం. జెర్సీని ధ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈ జెర్సీని పాండ్యా ఎందుకు ధ‌రించాడో తెలుసా అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఐసీసీ అభిమానులకు ప్రశ్న సంధించగా ఫ్యాన్స్‌ తమకు తెలిసిన సమాధానాలు ఇచ్చారు.

2009లో విజ‌య్ మ‌ర్చంట్ అండ‌ర్ -16 టోర్నీలో భాగంగా బ‌రోడా త‌ర‌పున బ‌రిలోకి దిగిన పాండ్యా 228 ప‌రుగులతో రాణించాడు. త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ఏకైక డ‌బుల్ సెంచ‌రీ ఇదే కావ‌డం విశేషం.

ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడినప్పుడు పాండ్యా.. ఇదే నెంబ‌ర్ జెర్సీ ఉన్న ధ‌రించి బ‌రిలోకి దిగాడు. అలాగే భార‌త జ‌ట్టులోకి ప్రవేశించిన త‌ర్వాత కూడా ఇదే నెం. జెర్సీతో ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ నుండి స్పూర్తి పొందడానికే 228 జెర్సీని హార్ధిక్ ధరిస్తాడని ఫ్యాన్స్ వెల్లడించారు.

- Advertisement -