ICC Rankings:పాండ్యా నెంబర్ 1

199
- Advertisement -

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1గా నిలిచాడు హార్థిక్ పాండ్యా. ఆల్‌రౌండర్ విభాగంలో పాండ్యా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన పాండ్యా…శ్రీలంక ఆటగాడు హసరంగను అధిగమించి నెంబర్ వన్‌గా నిలిచాడు.

150 కంటే ఎక్కువ స్ట్రయిక్‌ రేట్‌తో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్ల తీశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయగా టీ20 వరల్డ్ కప్‌ను దక్కించుకుంది టీమిండియా.

పాండ్యా తర్వాత హసరంగ, మార్కస్ స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, దీపేంద్ర సింగ్‌, లియామ్ లివింగ్‌స్టోన్, ఐడెన్ మార్క్‌రమ్, మోయిన్‌ అలీ ఉన్నారు.

Also Read:విశ్వక్ సేన్..’లైలా’ గ్రాండ్ లాంఛ్

- Advertisement -