భారత మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు భారత స్పిన్నర్ హర్బజన్ సింగ్. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసిన భజ్జి…తన కెరీర్‌లో 2007 ప్రపంచకప్ అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన సంవత్సరం అన్నారు. ఆ ఏడాదే క్రికెట్ నుండి దూరం కావాలనే ఆలోచన కూడా వచ్చిందన్నారు.
ఇందుకు ప్రధానం కారణం కోచ్ గ్రేగ్ చాపెల్ అని తెలిపిన హర్బజన్…ఓ జట్టును నాశనం చేయగల సమర్దుడు చాపెల్ అన్నాడు. చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో గంగూలీ తన ధైర్యాన్ని కొల్పోయారని తర్వాత జట్టులో స్ధానం కూడా కొల్పోయారని తెలిపాడు.
జట్టులో ఐక్యత, క్రీడా స్పూర్తి లేకుండా చేశాడని…అసలు అతను కోచ్‌గా వచ్చిన ఉద్దేశం ఏంటో ఎవరికి అర్ధం కాలేదన్నాడు. చాపెల్‌కు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది, అతను అలాంటి పనులు చేసేవాడు అని తెలిపాడు. చాపెల్ వెళ్లిన తర్వాత టీమిండియా పూర్వవైభవాన్ని సంతరించుకుందన్నాడు.