ఒక మనసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెగాడాటర్ నిహారిక. ఆ సినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోయిన నటన పరంగా నిహాకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ మెగా డాటర్ ప్రస్తుతం హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా చేస్తోంది. సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా చేసిన ఈ సినిమా ద్వారా లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశానని.. మంచి టీంతో పనిచేయడం ఆనందంగా ఉందని నీహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తన హ్యాపీనెస్ ను షేర్ చేసింది నిహారిక. ఇది పల్లెటూరి నేపథ్యంగా సాగే ప్రేమకథ. పల్లెటూరి కుటుంబాల మధ్య చోటుచేసుకున్న అనుబంధాల కథ. ఈ సినిమాలో సీనియర్ ఆరిస్టులు చాలామంది ఉన్నారట. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నిహారిక భావిస్తోంది.
దీంతో పాటు తమిళంలో సైతం ఓ చిత్రంలో నటిస్తోంది నిహారిక. ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తుండగా అరుముగ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. నిహారిక రెండు వైవిధ్యమైన పాత్రలలో కనిపించనున్నట్టు టాక్.