నిహారిక….హ్యాపీ వెడ్డింగ్

197
Happy Wedding For Mega Daughter
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు గారాల పుత్రిక నీహారిక తన రెండవ సినిమాకు సిద్ధమైంది. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన నీహారిక.. చాలా గ్యాప్ తర్వాత రెండో సినిమాకు సిద్ధమైంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మణ్ డైరక్ట్ చేస్తుండగా హ్యాపీ వెడ్డింగ్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానరే ఈ సినిమాని కూడా నిర్మించనుంది.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. అక్టోబ‌ర్ 4 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీ ఆడియ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. నూత‌న ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఈ చిత్రానికి కార్య ద‌ర్శ‌క‌త్వ బాధ్యత‌లు చూసుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం వున్నట్టు సమాచారం.

నిహా  తొలి తెలుగు చిత్రం హిట్ కాకపోయినా ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఆమె హిట్ కొడుతుందేమో చూడాలి. పెద్ద బ్యానర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది.

- Advertisement -