కేసీఆర్‌ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..

1007
- Advertisement -

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దంపతుల పెళ్లిరోజు. ఈ రోజుతో వారి పెళ్లి జరిగి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు,శ్రేయోభిలాషులు,ఆయనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. భార్యాభర్తల అపురూప బంధానికి, ఆదర్శ దాంపత్యానికి నిలువెత్తు రూపం, నాడు ఆ సీతారామచంద్రులు నేడు ఈ శోభ చంద్రులు.. సాక్షాత్తు సీతారాముల్లాంటి పుణ్యదంపతులు శ్రీ కేసీఆర్, శోభమ్మ గార్లకి మా గ్రేట్‌ తెలంగాణ.కామ్‌ తరుపున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

CM KCR

ఇక సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. కేసీఆర్‌ 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది.

CM KCR

- Advertisement -