ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకు సంబందించి రిలీజ్ డేట్ కూడా తాజాగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కానుందని ఎనౌన్స్ చేశారు. అయితే ఈ రిలీజ్ డేట్ వెనుక ఎన్టీఆర్ కి కలిసొచ్చే చాలా అంశాలున్నాయి. ఏప్రిల్ 5 , 6 ,7 వీకెండ్ , 9 న ఉగాది పండుగ , 11 న ఈద్ , 14 అంబేద్కర్ జయంతి , 17 శ్రీరామ నవమి ఇలా అన్నీ చూసుకునే ఈ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
వీకెండ్ పైగా వరుస హాలిడేస్ తో ఎన్టీఆర్ 30 సినిమాకు అన్నీ బాగా కలిసొచ్చాయి. టాక్ ఏ మాత్రం బాగున్నా ఈ కలిసొచ్చే రోజులతో సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లు అందుకోవడం ఖాయం. ప్రస్తుతం ఎన్టీఆర్ హోలీడే ట్రిప్ లో ఉన్నాడు. మరో వారంలో ఇండియా రానున్నాడు. ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్స్ పై మిక్కిలినేని సుధాకర్ , హరి కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..