మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

589
womens day
- Advertisement -

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి ప్రతీకే (ఉమెన్స్‌ డే) అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

ఈ ఉమెన్స్‌ డే 1907లో న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలోని స్ధితి గతులపై విసుగెత్తిన మహిళలు పనిగంటలు తగ్గింపు, వేతనాల పెంపు, ఓటు హక్కు కోసం నినదిస్తూ దాదాపు 15000 మంది సమ్మె చేశారు. సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది.

మరోకధనం ప్రకారం 1857 మార్చి 8 వ తేదీన న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలో జరిగిన సమ్మె 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదే స్ధితిగతులు కొనసాగుతున్నందున 1907 లో ఈ సమ్మె జరిగింది. ఆ కారణంగా ప్రతి సంవత్సరం మార్చి 8న ‘ఉమెన్స్ డే’ జరుపుకుంటున్నారు.

ఇక తొలిసారి భారతదేశంలో అహ్మదాబాద్‌లోని అనసూయ సారాభాయ్ టెక్స్‌టైల్స్ లేబర్ అసోసియేషన్ పేరుతో తొలి మహిళా కార్మిక సంఘం ఆవిర్భవించింది. కాగా, జర్మనీలో 1914 మార్చి 8న మహిళా సంఘాలు ఓ పోస్టర్‌ను విడుదల చేశాయి. అందులోని అక్షరాలు వివక్షపై మహిళల పోరాటానికి నిలువుటద్దంలా నిలిచాయి. ఈ విధంగా మహిళాదినోత్సవానికి ప్రత్యేకత సంతరించుకుంది.

Also Read:IPL 2024 :వారంతా రీఎంట్రీ ఇస్తారా?

- Advertisement -