- Advertisement -
ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు.
కాగా, నాన్న సేవలను గుర్తు చేసుకునేందుకు ఫాదర్స్ డే పేరుతో ఒక రోజును (జూన్ 19) కేటాయించారు. ఏటా జూన్ మూడో ఆదివారం ఇది వస్తుంది. అమ్మను మించి దైవం లేదని చెప్పుకుంటాం. అమ్మ పాత్ర ఎంతో.. నాన్న పాత్ర కూడా అంతే. కాకపోతే అమ్మ ముందుంటే, నాన్న వెన్ను తట్టేందుకు వెనుక ఉంటాడు.
- Advertisement -