హ్యాపీ బర్త్ డే లవ్..అనసూయ

340
Happy bithday reshmi-ansuya
- Advertisement -

బుల్లితెరపై యాంకర్లుగా రాణిస్తూనే సినిమాల్లో వచ్చే ఛాన్సులను అందిపుచ్చుకుంటున్న ప్రముఖ యాంకర్లు రష్మీ, అనసూయ. జబర్దస్త్‌కు యాంకర్ గా  వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జబర్దస్తుకు అనసూయ దూరమవ్వడంతో ఆ స్థానంలో రష్మికి ఆ అవకాశం రావడంతో ప్రస్తుతం జబర్దస్తు యాంకర్‌గా రాణిస్తూనే ఇతర  ప్రోగ్రామ్ లను చేస్తుంది  రష్మి.

Happy bithday reshmi-ansuya

ఇక నేడు రష్మీ పుట్టిన రోజు కావడంతో అనసూయ ట్విట్టర్ వేదికగా తనకు  శుభాకాంక్షలు తెలిపింది అనసూయ. ‘రష్మీ (27) నా గురించి ఒకవేళ ఎవరైనా వింటే, మిమ్మల్ని మెంటల్ అనుకుంటారు. మా మధ్య బంధం ఇంత ధృఢంగా ఎప్పుడు మారిందో నేను చెప్పలేను. ఇద్దరికి ఎన్నో థెరపీస్ పూర్తైన మీదట మేం చాలా క్రేజీగా మారిపోయాం. కానీ మా ఇద్దరిలో బ్యాడ్‌గా ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారో నాకు తెలియదు. హ్యాపీ బర్త్ డే లవ్’ అంటూ అనసూయ రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. వీరిద్దరు కలిసున్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది అనసూయ. తాజాగా రంగస్థలం సినిమాతో మంచి హిట్ ను అందుకుంది అనసూయ. ఈ సినిమాతో ఆమెకు మరిన్నీ చాన్సులు వస్తున్నాయి.

- Advertisement -