తన సొంత టాలెట్ తో ఎటువంటి వారసత్వం లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు నటుడు ఉదయ్ కిరణ్. అనతికాలంలోనే స్టార్ హిరోగా ఎదిగిపోయాడు. చాలా మంది అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయాడు. కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. అప్పట్లో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి వరుస హిట్స్ తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.. దాదాపు ఉదయ్ చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్సే …. మూడు సినిమా ల తోనే అమ్మాయిల్లో కూడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అంతటి స్టార్ ను సంపాదించిన ఉదయ్ కిరణ్ కు వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి. అయినా కుంగిపోకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఓ వైపు వరుస ప్లాప్ లు మరోవైపు వ్యక్తిగత సమస్యలతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ ఆత్మహత్యపై చాలా మంది పలు అనుమానులు వ్యక్తం చేశారు. ఇక ఇవాళ ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.
ఉదయ్ కిరణ్ జూన్ 26, 1980లో జన్మించారు. ఉదయ్ కిరణ్ తల్లితండ్రులు వీవీకే మూర్తి, నిర్మల. ప్రముఖ దర్శకుడు తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు ఉదయ్. తనదైన స్టైల్ , నటనతో యువతను ఆకట్టుకున్నాడు. ఈమూవీ పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నువ్వునేను సినిమా కూడా భారీ విజయం సాధించింది. వరుస విజయాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ నటనకు 2001లో ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చింది.
Also Read:పండరీపురానికి సీఎం కేసీఆర్..
తన కెరీర్‌లో మొత్తం 22 సినిమాల్లో శ్రీరామ్, హోళీ, నీ స్నేహం, జోడీ నం1, నీకు నేను నాకు నువ్వు, లవ్ టుడే, ఔనన్నా కాదన్నా, పోయి, వియ్యాలవారి కయ్యాలు, వంబు సందయి, గుండె ఝల్లుమంది, ఏకలవ్వుడు , పెన్ సింగం, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, దిల్ కబాడీ, ఈ పెద్దోళ్లున్నారే, జైశ్రీరామ్ సినిమాల్లో నటించారు.
Also Read:ప్రభాస్ కటౌట్..వాడుకునే దర్శకులు లేరా?