హ్యాపీ బర్త్ డే ‘వినాయక్’

235
- Advertisement -

తెలుగు తెరపై యాక్షన్ చిత్రాలను కొత్తపుంతలు తొక్కించిన దర్శకుడు వి.వి. వినాయక్. మాస్ ప్రేక్షకులపై ఆయన సినిమాలు మంత్రంలా పనిచేస్తాయి. ఆయన నటించిన సినిమాల్లోని కథానాయకులని మాస్ ఇమేజ్ వెదుక్కుంటూ వస్తుంది. అందుకే మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలందరూ ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. వినోదాన్ని …. సెంటిమెంటును కలగలిపి ప్రేక్షకులు కోరుకుంటోన్నవిధంగా అందించడం ఆయన ప్రత్యేకత. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

‘ఆది’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వివి వినాయక్ మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తూ మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.1974 అక్టోబర్ 4 న పశ్చిమ గోదావరి జిల్లాలో చాగల్లు అనే గ్రామంలో కృష్ణారావు – నాగరత్నం అనే దంపతులకు జన్మించాడు. సినిమాలపై ఉన్న మక్కువతో సినిమా రంగంలోకి వచ్చి వివి వినాయక్ 2002 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘ఆది’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేశాడు.

vinayak

నూతనత్వానికి పెద్దపీట వేసే తన అభిమాన హీరో చిరంజీవిని చూసి మురిసిపోయేవాడు. బహుశా.. చిరు చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తారని వూహించి ఉండరు. తన తొలి చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి’ , నితిన్‌తో ‘దిల్‌’, చిరంజీవితో ‘ఠాగూర్‌’ చిత్రాలను తెరకెక్కించారు. లంచగొండితనాన్ని అంతం చేయడానికి ఓ సామాన్యుడు ఏ విధంగా పోరాడాడో తెలిపే ‘ఠాగూర్‌’ వినాయక్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’తో కామెడీ పండించి, అదుర్స్‌ అనిపించుకున్న వినాయక్‌ బద్రీనాథ్‌తో కొంచెం నిరాశ చెందారు. తర్వాత నాయక్‌, అల్లుడు శ్రీను, అఖిల్‌ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబరు 150’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై పరిశ్రమతోపాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

chiru_kathi

జయాపజయాలతో నిమిత్తం లేకుండా వినాయక్ పండించే వినోదం కోసం ప్రేక్షకులు ఆయన చిత్రాల కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు… వినాయక్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతల్లోనూ పొంగిపొరలుతోంది… యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ గా నిలచిన వినాయక్ ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -