హ్యాపీ బర్త్ డే…రజనీకాంత్

33
super star

అతడు పెద్ద అందగాడు కాదు.. డాన్స్ లు చేయలేడు. కానీ అతడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. అతడి స్టైల్ అదుర్స్. అతడి సినిమా వస్తోందంటే..పడిచచ్చే ఫ్యాన్స్ కోట్లాదిమంది ఉన్నారు. కోలీవుడ్, టాలీవుడ్ బాలీవుడ్.. ఏ వుడ్ అయినా.. అతడి సినిమా వస్తోందంటే.. షేక్ అవ్వాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్…బర్త్ డే నేడు

1950 డిసెంబర్ 12 న కర్ణాటకలో రామోజీరావ్ గైక్వాడ్, జిజియా బాయ్ దంపతులకు జన్మించారు రజనీ. అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జిజబాయి మరియు రామోజి రావుకి నాలుగొవ సంతానం రజినికాంత్, తండ్రి కానిస్టెబుల్ రజనికాంత్ తన తల్లిని ఎనిమిది సంవత్సరాల వయస్సు లోనె కోల్పోయాడు. రజినికాంత్ తన పాఠశాల చదువు అచార్య పాఠశాల భన్నారగట్టా, బెంగళూరు లో పూర్తిచేడు.రజనికాంత్ తన చిన్న వయస్సు లో చాలా కష్టాలు అనుభవించాడు ఎందుకంటే కుటుంబ ఆదాయం తక్కువ, తన మాతృ భాష మారటి.

ఆర్టీసీ కండాక్టర్ గా పనిచేసిన సూపర్ స్టార్ … తన స్నేహితుడు తోటి డ్రైవర్ సాయంతో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. అక్కడే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దృష్టిలో పడ్డారు. అపురూప రాగంగల్ సినిమాతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కేరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ పాత్రల్లో కనిపించారు. ముత్తు రామన్ డైరెక్షన్ లో వచ్చిన భువన ఓరు కల్వికరు చిత్రం రజనీకాంత్ ను హీరోగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. దక్షిణ భారతదేశ చిత్రాలతో పాటు బాలీవుడ్,హాలీవుడ్,జపాన్ ,జర్మనీ మొత్తం 168 కిపైగా సినిమాల్లో నటించారు.

అప్పటికే సినిమాల్లో శివాజీ పేరుతో నటుడు ఉండటంతో శివాజీరావ్‌కు వేరే పేరు పెట్టాలనుకున్నారు. బాలచందర్‌ పేరు కోసం ఎక్కువసేపు ఆలోచించలేదు. ఆయన తీసిన సినిమా మేజర్‌ చంద్రకాంత్‌లో ఓ పాత్ర పేరు రజనీకాంత్‌. దీంతో ఈపేరును శివాజీకి పెట్టాలని నిర్ణయించారు. దీంతో శివాజీరావుకు ఇష్టదైవమైన రాఘవేంద్రస్వామిని ఆరాధించే గురువారం నాడు రజనీకాంత్‌గా నామకరణం చేశారు. తొలి సినిమానే రజనీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

తన మేనరిజం, స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రజనీ. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతీ భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘భైరవి’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సందర్భంగా ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్‌’ అని వేశారు.

రజనీకాంత్‌ జీవితంలో ఎన్నో భోగ భాగ్యాలను అనుభవించారు. అప్పుడు ఎంత స్టార్‌ స్టేటస్‌ అనుభవించారో ఇప్పుడు అంత నిరాడంబరంగా ఉంటారు.రజనీకాంత్‌ అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. రజనీ స్టార్‌ హోదా అనుభవిస్తున్న సమయంలో చెడు అలవాట్లకు బానిస అయ్యారు. మనశ్శాంతిని కోల్పోయారు. అప్పుడే అమితాబ్‌ ఆయనకు ఓ సలహా ఇచ్చారు. ‘స్వామి సచ్చిదానంద ఆశ్రమంలో కొద్దిరోజులు ఉండి చూడండి. మీరు కోరుకున్న ప్రశాంతత దొరుకుతుందేమో’ అని అన్నారు. అలా ఆయన మాటతో రజనీ తొలిసారి హిమాలయాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు. అక్కడ రోజుల తరబడి తపస్సు చేస్తూ ఉంటారు.

కాలం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. పరీక్షిస్తుందో తెలియదు. కానీ కచ్చితంగా పరీక్షించి తీరుతుంది. కాల పరీక్షను ఎదుర్కొని నిలబడిన వాడు కాలగమనంలో కలిసిపోడు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోడు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోడు. ఆ వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అంటారు. రజనీకాంత్‌ కూడా అంతే. శివాజీ దారి ‘రహదారి’, రజనీది ‘సింహపు దారి’. శివాజీ.. రజనీ అయ్యాడు.. రజనీ ఎప్పుడూ శివాజీని మర్చిపోలేదు. ప్రతిసారి

తలైవా బర్త్ డే అంటే తమిళనాడు పండగలా ఉంటుంది. తాజాగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండటంతో తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో తలైవాగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న రజనీ…రాజకీయాల్లోనూ రాణించాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.