హ్యాపీ బర్త్ డే…ప్రణీత

253
karthika
- Advertisement -

‘బావ’, ‘శకుని’ చిత్రాల ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రణీత. అయితే ఓ వైపు అందివచ్చిన ప్రతి ఛాన్స్‌ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ బాపుగారి బొమ్మ…వపర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అత్తారింటికి దారేది సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇవాళ ఈ బాపుగారి బొమ్మ పుట్టినరోజు సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

అత్తారింటికి దారేది తర్వాత ఎన్టీఆర్తో రభస, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవ సినిమాలు చేసింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొళ్తా కొట్టడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత రామ్‌తో హలో గురు ప్రేమలో నటించిన ఈ అమ్మడికి తర్వాత అవకాశాలు కలిసిరాలేదు.దీంతో టాలీవుడ్‌కు దూరమైంది ప్రణీత.

కానీ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది. క‌రోనా సంక్షోభంలో త‌న‌కి తోచినంత సాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి బర్త్ డే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com కోరుకుంటోంది.

- Advertisement -