నితిన్ బర్త్ డే….స్పెషల్

120
nithin
- Advertisement -

తొలి సినిమా జయంతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నితిన్. ఫస్ట్ సినిమానే సూపర్‌ హిట్‌ కావడంతో ఫుల్ జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ యూత్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.ఎన్. సుధాకర్ రెడ్డి తనయుడైన నితిన్ తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు . ఇవాళ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.

నితిన్ కుమార్ రెడ్డి 1983 మార్చి 30న జ‌న్మించారు. ఆయ‌న తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన ‘జయం’ టైటిల్ కు తగ్గట్టే సక్సెస్ ను సాధించింది. తొలి చిత్రంతోనే నితిన్ కు లవర్ బోయ్ ఇమేజ్ దక్కింది. తర్వాత దిల్, సై, ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి యూత్‌పుల్‌ చిత్రాలతో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. సంబరం , శ్రీ ఆంజనేయం, ధైర్యం, అల్లరి, బుల్లోడు, రామ్,విక్టరీ సినిమాలు తీసినా పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. విక్టరీ సినిమాతో సిక్స్ ప్యాక్‌తో కనిపించిన నితిన్ ఫ్యాన్స్‌ను సంపాదించకున్నారు.

వరుస పరాజయాల బాట నుండి త్రివిక్రమ్ అ..ఆ!తో గట్టెక్కిన నితిన్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో పాటలను రీమిక్స్ చేసి నటించీ మురిసిపోయారు నితిన్. ‘ఇష్క్’ తరువాత నితిన్ హీరోగా రూపొందిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో పవన్ ‘తొలిప్రేమ’లోని “ఏమయిందో ఈ వేళ…” సాంగ్ ను రీమిక్స్ చేసి నటించి మురిపించారు.

జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకొనే ప్రయత్నం చేశారు నితిన్. ప్రస్తుతం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంపై భారీ ఆశలు పెట్టుకున్న నితిన్‌…ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలిన గ్రేట్ తెలంగాణ.కామ్(greattelangaana.com) మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -