హ్యాపీ బర్త్‌ డే..నభా నటేష్

177
nabha natesh
- Advertisement -

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకున్న భామ నభా నటేష్. ఇండస్ట్రీలో ట్రేండింగ్ హీరోయిన్ గా మారిన ఈ ఇస్మార్ట్ గాళ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ వైపు వరుస సినిమాలు మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్‌తో యూత్‌ని ఫిదా చేస్తోంది.ఇక ఇవాళ నభా నటేష్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నబ్బా కన్నడలో (2015) ‘వజ్రకాయ’లో సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలవడంతో ఒక్కసారిగా నబ్బా కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చోటుసంపాదించింది. ఇక తెలుగులో సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నబా…తర్వాత రవిబాబు దర్శకత్వంలో అదుగో,రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్, రవితేజతో డిస్కో రాజాతో సినిమాలు చేసింది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్‌ ఈ నెల 25న బెటర్ థియేటర్లలో విడుదల కానుంది. నబా ప్రేక్షకులను మరింతగా అలరించాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -