హ్యాపీ బర్త్ డే….సంతన్న

1087
mp santhosh
- Advertisement -

జోగినపల్లి సంతోష్ కుమార్ ..తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. అందరివాడిగా..అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ..స్నేహానికి మారుపేరుగా ..నిజాయితీకి నిలువుటద్దం గా మారిన సంతన్న పుట్టినరోజు నేడు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన సంతోష్…గులాబీ బాస్ తనకు అప్పజెప్పిన ప్రతి బాధ్యతను విజయవంతంగా పూర్తిచేశారు. ఉద్యమనేతగా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయలుదేరుతున్న సమయంలో ఆనాటి పాలకులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినప్పుడు.. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించేవరకు సంతోష్‌కుమార్ అధినేత వెన్నంటే ఉన్నారు. ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మారీన టీ న్యూస్ చానెల్ ఎండీగా సేవలందించారు.

అధినేత వ్యక్తిగత విషయాలతోపాటు పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు సమన్వయకర్తగా, అందరికీ తలలో నాలుకలా మెదులుతున్నారు. సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. ఓపిగ్గా పరిష్కరించి, వినయంగా నిలబడే నిండైన వ్యక్తి. పార్టీలో సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. వివాదరహితుడిగా తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. అందుకే పార్టీ కోసం అహర్నిషలు కృషిచేసిన సంతోష్‌ను టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శిగా,తర్వాత రాజ్యసభ సభ్యులుగా నియమించారు సీఎం కేసీఆర్.

వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందనే నానుడిని నిజంచేస్తూ సంతోష్ కుమార్ మనసులో పురుడు పోసుకున్నగ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమం ఎందరినో కదిలించింది. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా మొక్కలు నాటారు. అంతేగాదు తనవంతుగా కీసరగుట్ట అభయారణ్యాన్ని అభివృద్ధ్ది చేసి ఎకో టూరిజం కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ లు వద్దని వాటికి బదులు ఓ మొక్కను నాటి సెల్ఫీ దిగిన ఫోటోను పంపించాలని పిలుపునిచ్చిన సంతన్న…ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని…మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రేట్ తెలంగాణ మనస్పూర్తిగా కోరుకుంటోంది.

Joginapally Santosh Kumar is a political leader from the Telangana Rashtra Samithi party and presently a Member of the Parliament of India representing Telangana in the Rajya Sabha

- Advertisement -