సంపూర్ణమైన ప్రేమ కు పరిపూర్ణమైన ప్రతిబింబం..ప్రేమించడం అంటే బ్రతికించడం ..కేవలం మనుషుల్ని కాదు .. ఆశలను బ్రతికించడం .. ఆశయాలను బ్రతికించడం.. ఇచ్చిన మాటను బ్రతికించడం..అంటూ విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు జాగర్లమూడి క్రిష్. ఆయన తీసే సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించలేకపోవచ్చు.. కానీ మనసును హత్తుకుంటాయి. కమర్షియల్ సక్సెస్ కోసం ట్రెండ్‌ను ఫాలో అయిపోవడం, తీసిన కథలతోనే సినిమాలు తీయడం ఆయన డిక్షనరీలోనే ఉండదు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
గుంటూరు జిల్లాలోని వినుకోండలో 1977 నవంబర్ 10న జన్మించాడు క్రిష్. తీసింది నాలుగు సినిమాలే అయినా వంద సినిమాల అనుభవం కొట్టేసి, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్రా శాతకర్ణి చిత్రానికి దర్శక చాన్చ్ అందిపుచ్చుకున్నాడు క్రిష్. తను దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే (గమ్యం) ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని పొందాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె మొదలైన సినిమాలు తీశాడు.
‘కళ అంటే బ్రతుకు నిచ్చేదే కాదు.. బ్రతుకు నేర్పేది కూడా..’ ‘అది కల నిద్దురలో కనేది.. ఇది కళ నిద్దుర లేపేది.’ ‘బ్రతుకు కోడి గుడ్డు లాంటింది భయ్యా.. ఏది పెద్దదవుతుందో, ఏది అమ్లెట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు’ ‘కొన్ని చావులు చూసి గర్వపడాలి’ ‘గర్భగుడిలో ఊరకుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు అపవిత్రం అయిపోడు.’, ‘ తొమ్మిది మాసాలు కష్ట పడి అమ్మ మనల్ని కన్నదని కొంత మంది అనుకుంటారు, నాన్న పక్కన పది నిమిషాలు సుఖ పడి మనల్ని కన్నదని మరికొంత మంది అనుకుంటారు, పడక సుఖం చూసినవాడు పశువు అవుతాడు. పురిటి కష్టం చూసిన వాడు మనిషి అవుతాడు’ అంటు కృష్ణం వందే జగద్గురం డైలాగ్‌లతో అందరిని ఆకట్టుకున్నాడు.
వేదం’ను ‘వానమ్’ పేరుతో రీమేక్ చేసి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు క్రిష్. అక్కడా మంచి ఆదరణ లభించింది… ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో కర్ణాటకలో సాగిన మైన్ మాఫియాను నేపథ్యంగా ఎంచుకున్నాడు… ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, క్రిష్‌కు డైరెక్టర్ గా మరిన్ని మార్కులు సంపాదించి పెట్టింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ‘గబ్బర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు క్రిష్.
ఒక చక్కని ప్రేమకథకు, రెండవ ప్రపంచ నేపథ్యాన్ని జోడించి, ప్రపంచ వ్యాప్తంగా నైనా లేదా ఒక మారుమూల గ్రామంలోనైనా వ్యక్తులమధ్య తమ ఉనికి ని, పెత్తందారీ తనాన్ని, అజమాయిషీ ని చేలాయించుకొనాలనువాళ్ళ మధ్య సామాన్యులు తమ హృదయాలలో ప్రేమ భావనను మరచి కంచెలు ఎలా కట్టుకుంటున్నారో హృదయాన్ని హత్తుకునేటట్టుగా చూపించడంలో దర్శకుడు నూటికి నూరు పాళ్ళు విజయవంతం అయ్యారు.ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.
ఇటీవలె హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రమ్యని పెళ్లిచేసుకున్నాడు క్రిష్. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించే మానవతా వాదుల స్వప్నం సాకారం కావాలని జాగర్లమూడి చేసిన సంకల్పం…కంచె..ఇది నా అనుభూతి మాత్రమె. నా అభిప్రాయం ఎవరిమీద రుద్దాలనే ప్రయత్నం మాత్రం కాదని ఒప్పుకునే నిగర్వి క్రిష్. ప్రస్తుతం బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. సంక్రాతి కానుకగా విడుదల కానున్న ఈ మూవీ ఘన విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.