తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్. కోలీవుడ్‌లో అగ్రహీరోగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్…ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో తన మార్కెట్‌ను పెంచుకుని బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్నాడు. నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రత్యేక కథనం.
విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభ సినిమా నేపథ్యగాయని,కర్ణాటక సంగీత విధ్వంసులు.విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీని పూర్తిచేసిన విజయ్ …చిన్నపట్టి నుండే నటపై ఆసక్తికనబర్చాడు. ఆ ఇంట్రెస్ట్‌తోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన విజయ్..తన నటన,ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచితనంతో అశేష ప్రేక్షక అభిమానుల్ని సంపాదించుకున్నారు.
తెలుగులో రీమేక్ అయిన సర్కార్,అదిరింది,ఏజెంట్ భైరవ,పోలీస్,జిల్లా,పులి,దమ్ముంటే కాస్కో,స్నేహితుడు,విజిల్ వంటి సినిమాలతో మంచి మార్కెట్ పెంచుకున్నారు విజయ్. ప్రస్తుతం లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇక తమ అభిమాన హీరో బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతుండగా విజయ్ ఇలాంటి బర్త్ డే వేడుకలను మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.