గంగోత్రి చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. మెగాఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫ్యామిలీ ఇమేజ్‌ను కాపాడుకుంటూ తనని తాను మలుచుకుంటూ చేసిన ప్రతి పాత్రలో ఒదిగి పోతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు బన్నీ. అమ్మాయిల మనసు దోచుకున్న ఆర్యగా, కలెక్షన్లు కొల్లగొట్టిన దేశ ముదురుగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న సరైనోడుగా టీ టౌన్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు బన్నీ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.
1982లో చెన్నైలో జన్మించారు. బిబిఏలో గ్రాడ్యూయేట్ చేసిన బన్నీ తొలుత చిరంజీవి ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా చిన్న పాత్రలో మెరిసారు. ఆ తర్వాత ‘డాడీ’ చిత్రంలో డాన్సర్‌గా కనిపించారు. ముంబైలో నటనలో శిక్షణ తీసుకుని 2003లో కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా మారారు.
తొలి చిత్రమే బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తర్వాత ఆర్య,బన్నీ,హ్యాపీ,దేశముదురుతో సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అల్లు అర్జున్ అంటూ పిలిచినా.. మాస్ ఆడియన్స్ బన్ని అని పిలిచినా.. పిల్లలు ఆర్య అని పిలిచినా ..అభిమానులు స్టైలిష్‌స్టార్ అని పిలిచినా ఆయనకే చెల్లింది. అటు అభిమానులకు ఇటు నిర్మాతల అందరికి అందుబాటులో ఉండే హీరోగా పేరు తెచ్చుకున్నారు.
క్రిష్‌తో ‘వేదం’, వినాయక్‌తో ‘బద్రీనాథ్’, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, పూరీ జగన్నాథ్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’, సురేందర్ రెడ్డితో ‘రేసుగుర్రం’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించాడు. సరైనోడుతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిస్ట్ సాధించాడు. ‘ఆర్య’, ‘పరుగు’ చిత్రాలకు గానూ ఉత్తమ నటుడిగా నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందుకున్నారు. వేదంలో కేబుల్ రాజుగా అర్జున్ యాక్టింగ్ కు క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు బన్నీ.
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. అదంతా తన ఎంట్రీ వరకేనని నమ్మే హీరోల్లో అర్జున్ ఒకరు. బన్నీ మరిన్ని చిత్రాలతో ఎంటర్ టైన్ చెయ్యాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూ ర్తిగా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Also Read:ఉడకబెట్టిన శనగలు తినడం మంచిదే.. కానీ!