హ్యాపీ బర్త్ డే…అదితీరావు హైదరి

317
aditirao
- Advertisement -

సమ్మోహనం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ అదితీరావు హైదరి. ఈ సినిమాలో సమీరగా ప్రేక్షకులను మెప్పించిన అదితీ తర్వాత వరుణ్‌ తేజ్‌ అంతరిక్షం సినిమాలో రియాగా అదరగొట్టింది.

బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించిన ఈ హైదరాబాదీ అమ్మాయి పలు దక్షిణాది చిత్రాల్లోనూ సందడి చేస్తోంది. ఇవాళ అదితీ పుట్టినరోజు సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

ఇటీవలె నాని బితో పాటు మలయాళ చిత్రం ‘సూఫియమ్‌ సుజాతయుమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాల్లో అదితి నటనకు మంచి మార్కులు పడగా ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ‘హే సినామికాతో పాటు విజయ్‌ సేతుపతితో ‘తుగ్లక్‌ దర్బార్‌’లో నటిస్తోంది. వీటితో పాటు ఓ తెలుగు చిత్రం, ఓ హిందీ చిత్రంలో నటిస్తోన్న అదితీకి గ్రేట్ తెలంగాణ.కామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -