హ్యాపీ బర్త్ డే తమన్నా..సైరా విషెస్

503
tamanna
- Advertisement -

అందం, అభినయం కలగలసిన కథానాయికల్లో తమన్నా ఒకరు. పాత్ర ఎలాంటిదైనా దానికి తగ్గట్టు తనను తాను మలుచుకోవడంలో ఈ అమ్మడి తీరే వేరు. దీనికి తాజా ఉదాహరణ ‘ఊపిరి’. ఈ సినిమాలో నాగార్జున పిఏ పాత్రకు అతికినట్టు సరిపోయింది. వస్త్రధారణ విషయంలోనూ, బాడీలాంగ్వెజ్‌లోనూ తమన్నా కనపరిచిన ప్రతిభను ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అందాల అభినయం మిల్కీ బ్యూటీ.. తమన్నా పుట్టినరోజు సందర్భంగా  greattelangaana.com ప్రత్యేక కథనం.

Happy birthday to Tamannaah

1989 డిసెంబర్ 21 న మహా రాష్ట్ర లో సింది కుటుంబం లో జన్మించిన తమన్నా తన చిన్నతనాన్ని ముంబై లో గడిపింది. “శ్రీ” చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం అయ్యింది. కాని తన మొదటి విజయం శేకర్ కమ్ముల చేసిన “హ్యాపీ డేస్” చిత్రం తో వచ్చింది. చిన్నతనం నుంచే సినిమాల్లో నటించడం అంటే ఆసక్తి. టీవీలో వచ్చిన సినిమాలు చూడటం, అందులో హీరోయిన్లలా తయారై రోజంతా ఆ పాత్రలో తనను తాను వూహించుకోవడం ఈ ధ్యాస తప్ప మరొకటి ఉండేది కాదట. ఆమె ప్రతిభ చూసి ఇంట్లో వారు కూడా ప్రోత్సహించడం ప్రారంభించారు.

Happy birthday to Tamannaah

2008లో తమన్నా నటించిన ‘కాళిదాసు’ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. సిద్ధార్థ్‌ సరసన నటించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫర్వాలేదనిపించింది. సూర్యతో చేసిన ‘వీడొక్కడే’ మంచి విజయం అందుకుంది. కార్తీతో ‘ఆవారా’, నాగచైతన్యతో ‘100% లవ్‌’ తమన్నాకు మంచి గుర్తింపు తెచ్చాయి. ‘బద్రీనాథ్‌’, ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘ఎందుకంటే.. ప్రేమంట’, ‘రెబల్‌’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘తడాఖా’,ఊపిరి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Happy birthday to Tamannaah

2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రంతో మెప్పించింది.  దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అవంతికగా ఈ చిత్రం తమన్నాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.

Happy birthday to Tamannaah

తెలుగులోనే కాదు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన తమన్నా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీకి బర్త్ డే విషెస్ తెలిపింది చిత్రయూనిట్.న ఈ మిల్కీ బ్యూటీ ఇలాగే మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -