హ్యాపీ బర్త్ డే ‘టబు’

467
Happy birthday Tabu
- Advertisement -

“నిన్నే పెళ్లాడుతా”, “ప్రేమదేశం” చిత్రాలతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగించింది టబు. ఎక్స్‌పోజింగ్ చేయడానికైనా సై అన్న టబు.. దక్షిణాది చిత్రాల్లో సైతం తన అందాలను ఆరబోసింది.అటు గ్లామర్‌ పాత్రల్ని, ఇటు నటనకి పెద్ద పీట వేసే పాత్రల్ని సమర్థంగా పోషించగల అతి కొద్దిమంది నటీమణుల్లో టబు ఒకరు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ నటనలో తనదైన శైలిని కనబరిచిన టబు రెండు జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇవాళ టబు పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Happy birthday Tabu

కూలీ నెంబర్ 1 చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన టబు..కుర్రాళ్ల గుండెలను పిండేసింది. తన అంద చందాలను ఆరబోసి అగ్రశ్రేణి హీరోలతో నటించే అవకాశాన్ని నటించే అవకాశాన్ని కొట్టేసింది. టబు హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి జమాల్‌ హష్మి, తల్లి రిజ్వానా.ఆమె ఓ స్కూల్‌ టీచర్‌. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు టబు. హైదరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో చదువుకొన్నారు. ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని 1983లో హైదరాబాద్‌ నుంచి ముంబయికి వెళ్లారు.

Happy birthday Tabu

1980లో టబు కెమెరా ముందుకు వచ్చారు. ‘బజార్‌’ అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించారు. బాలీవుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. ‘విజయ్‌పథ్’లో అజయ్ దేవగణ్ సరసన నటించి తొలి విజయాన్నందుకొంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ‘సాజన్ చలే ససురాల్’, ‘జీత్’ చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. హిందీలో చేసిన ‘మ్యాచిస్’ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘కాలాపానీ’ చేసింది. అది కూడా గుర్తింపును తీసుకురావడంతోపాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది.

Happy birthday Tabu

మీరానాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం ‘ది నేమ్ సేక్’లో టబు కీలక పాత్ర పోషించింది. 2012లో విడుదలైన ‘లైఫ్ ఆఫ్ పై’లోనూ లీడ్ రోల్ చేసింది. టబు హిందీలో చేసిన ‘చీనీకమ్’ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణను పొందింది. ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లండ్‌లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. హిందీ చిత్రాలతోపాటు మలయాళం, తమిళం, బెంగాళీ, మరాఠీ చిత్రాల్లో నటించి టబు తన అభిరుచిని చాటారు. 2016లో ‘ఫితూర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాలుగుపదుల వయస్సు పై బడినా, ఇప్పటికీ గ్లామర్‌ విషయంలో కుర్రహీరోయిన్లకు సవాల్‌ విసురుతూనే  ఉన్న టబు ప్రేక్షకులను మరింత అలరించాలని కోరుకుంటు..greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Happy birthday Tabu

- Advertisement -